HomeTelugu Big Storiesరివ్యూ: అర్జున్ రెడ్డి

రివ్యూ: అర్జున్ రెడ్డి

నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని, రాహుల్ రామకృష్ణ, కాంచన, సంజయ్ స్వరూప్ తదితరులు 
సంగీతం: రాధన్ 
సినిమాటోగ్రఫీ: రాజు తోట 
ఎడిటింగ్: శశాంక్
నిర్మాతలు: ప్రణయ్ రెడ్డి వంగ
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ
‘అర్జున్ రెడ్డి’ ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్స్ తో యూత్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏమేరకు ఎంటర్టైన్ చేసిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ: 
అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ) మెడిసిన్ చదువుతుంటాడు. కాలేజ్ లో టాప్ ర్యాంకర్. అయితే కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేడు. తన చదువు, కెరీర్ తనకు నచ్చినట్లుగా ఉండాలని అర్జున్ భావిస్తాడు. ఇది ఇలా ఉండగా, అదే కాలేజ్ లో జాయిన్ అయిన ప్రీతి(షాలిని) అనే అమ్మాయిని అర్జున్ చూసి ఇష్టపడతాడు. తనను ప్రేమిస్తాడు. ప్రీతి కూడా అర్జున్ ను ఇష్టపడుతుంది. ఇద్దరు కూడా సెటిల్ అయి ఇంట్లో పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తారు.ప్రీతి తండ్రి దానికి అంగీకరించడు. తమ కులానికి చెందిన వ్యక్తితోనే ప్రీతి పెళ్లి జరిపిస్తానని అర్జున్ తో గొడవ పడతాడు ప్రీతి తండ్రి. ప్రీతి తండ్రి ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తాడు. ఆ విషయం అర్జున్ కు తెలుస్తుందా..? తెలిసిన తరువాత అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడు..? 

చివరకి వీరిద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ: 
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వచ్ఛమైన ప్రేమలోని తీవ్రతను, అది విఫలమైనప్పుడు కలిగే భాధను గాఢమైన రీతిలో 
చెప్పారు. అర్జున్ రెడ్డి, ప్రీతిల మధ్య ఉండే ప్రేమను ఆయన స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసిన విధానం కొత్తగా ఉంది. యూత్ వరకు ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను చూసే సాహసం చేయలేరు. ఖచ్చితంగా తల్లితండ్రులతో కలిసి పిల్లలు చూసే సినిమా అయితే ఇది కాదు. మొదటి భాగం ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను మాత్రం బాగా సాగదీశారు. పతాక సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. కథలో పెద్ద ట్విస్టులు, మలుపు ఏం ఉండవు. అర్జున్ రెడ్డి అనే పాత్రను దర్శకుడు తీర్చిదిద్దిన తీరుని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము. ఆ పాత్రే కథకు ప్రాణం పోసింది. 
విజయ్ దేవరకొండ అధ్బుతంగా నటించాడు. తన డైలాగ్స్, నటనతో ఆడియన్స్ ను మెప్పించాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ స్టార్ ఇమేజ్ పెరుగుతుంది. షాలిని పాత్రలో క్లారిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. హీరోతో ఆమె ప్రేమలో ఎలా పడిందనే విషయంపై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే ఉన్నంతలో తన లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హీరో ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. తన పాత్ర ద్వారా కామెడీను జెనరేట్ చేసి ఆడియన్స్ ను నవ్వించారు. కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, గోపీనాథ్ భట్ తమ పాత్రల పరుధుల్లో బాగా నటించారు. 
సందీప్ రెడ్డి వంగ విఫల ప్రేమికుడి జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి రాసుకున్న కథ, కథనాలు చాలా వరకు ఆకట్టుకోగా బలమైన హీరో పాత్ర, సన్నివేశాలు చాలా రోజులపాటు గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. సంగీత దర్శకుడు రాధన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం బాగున్నాయి. రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ మీద శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది.
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu