మహేష్ బాబు మేనల్లుడుకి దర్శకుడు దొరికాడు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను సరైన సినిమాతో లాంచ్ చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నారు అశోక్. ఇన్నాళ్లకు ఆయన వెతుకులాట ఫలించి ఒక దర్శకుడు దొరికాడు. అతనే శ్రీరామ్ ఆదిత్య. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య అశోక్ గల్లాను హీరోగా లాంచ్ చేయనున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా మొదలయ్యాయి సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య గతంలో ‘భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేశారు.