HomeTelugu Newsకత్తి మహేష్‌పై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

కత్తి మహేష్‌పై దాడి.. కారు అద్దాలు ధ్వంసం

13 10
కత్తి మహేష్ ఈమధ్య రాముడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందూ సంఘాల్లో కోపాన్ని పెంచేస్తున్నాయి. ఏం తెలుసని నువ్వు మా రాముడి గురించి మాట్లాడుతున్నావ్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోమంటూ ఈయనపై విరుచుకు పడుతున్నారు హిందు సంఘ నేతలు. శ్రీ రాముడు మాంసం తింటాడని.. ఆయనకు జింక మాంసం అంటే ఇష్టమని ఈ మధ్యే కామెంట్ కత్తి మహేష్ చేసాడు. అప్పట్నుంచి ఈయనపై కోపంతో రగిలిపోతున్నారు హిందుత్వ వాదులు. ఇదిలా ఉంటే తాజాగా ఈయనపై దాడి జరిగింది.

ఐమాక్స్‌కు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు వచ్చిన ఈయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. ఆయన కారుపై దాడి చేసారు. దాంతో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడి నుంచి కత్తి మహేష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈయనకు ఎలాంటి గాయాలు కూడా కాలేదు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఐమాక్స్‌కు చేరుకుని కత్తి మహేష్‌ను అక్కడ్నుంచి సేఫ్‌గా పంపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!