నితిన్‌ ఎంత తగించాడో తెలుసా!

యంగ్‌ హీరో నితిన్‌ భుజానికి ఇటీవల గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. చికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో బరువు పెరిగానని నితిన్‌ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. తన జిమ్‌ ట్రైనర్‌ వంశీ సహాయంతో రెండు నెలల్లో 12 కిలోల బరువు తగ్గానని పేర్కొంటూ.. ఫొటోల కొలేజ్‌ను షేర్‌ చేశారు. వంశీకి ధన్యవాదాలు చెప్పారు. ‘కొన్ని నెలల క్రితం నా భుజానికి తీవ్ర గాయమైంది. దాన్నుంచి కోలుకోకముందే నా చేయి కాలింది. ఇక చేసేదేం ఉంటుంది విశ్రాంతి తీసుకోవడం తప్పా. అలా విశ్రాంతి తీసుకుని, తీసుకుని.. ఇలా బరువు పెరిగా. ఆపై చాలా కష్టపడి రెండు నెలల్లో 12 కిలోలు తగ్గా. ఇప్పుడు ఇలా ఉన్నా. నన్ను జాగ్రత్తగా చూసుకుని, సరైన డైట్‌, వర్కవుట్‌ ప్లాన్‌తో స్ఫూర్తినింపి.. తిరిగి ఇలా తయారు చేసిన జిమ్‌ ట్రైనర్‌ వంశీకి ధన్యవాదాలు’ అని నితిన్‌ అన్నారు.

దీనికి వంశీ ప్రతిస్పందించారు. నితిన్‌కు థాంక్స్‌ చెప్పారు. ఆయనతో ప్రయాణం అద్భుతమని, ఇలా తమ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇంత తక్కువ వ్యవధిలో 12 కిలోల బరువు తగ్గడం, గాయపడిన వెంటనే సాధన చేయడం పట్ల నెటిజన్లు నితిన్‌ను ప్రశంసిస్తున్నారు.