బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న.. ప్రభాస్‌ ‘మనోహరి’.. వీడియో వైరల్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి- ది బిగినింగ్’ సినిమాలో ‘మనోహరి’ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు.. తెలుగులో ‘టెంపర్’ ‘కిక్‌2’, ‘లోఫర్’, ‘ఊపిరి’ చిత్రాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. ఇటూ తెలుగులో చేస్తూనే అటూ హిందీలో కూడా ఇరగదీస్తోంది. అందులో భాగంగా.. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాలో కనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు బ్యాంకాక్‌లో బట్టలు అమ్ముకుంటున్న ఓ వీడియో సంచలనంగా మారింది. తెలుగు, హిందీ సినిమాల్లో మంచి డ్యాన్సర్‌గా, నటిగా పేరు సంపాదించిన నోరా బ్యాంకాక్ మార్కెట్‌లో నేల మీద కూర్చుని దుస్తులను విక్రయిస్తోంది. ఆ వీడియోలో ఆమె ఏమాత్రం మేకప్ వేసుకోకుండా ఉండడంలో..నిజంగా సేల్స్‌గర్ల్ మాదిరిగానే ఉంది. ఆమె చుట్టూ కొన్ని దుస్తులు ఉన్నాయి.