ఉగాదికి ‘BB3’ టైటిల్‌.. అఫీషియల్‌

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం BB3. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. నందమూరి అభిమానులు ఈ సినిమా టైటిల్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బీబీ3 సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ డేట్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున మధ్యాహ్నం 12:33 నిమిషాలకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించినున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

CLICK HERE!! For the aha Latest Updates