HomeTelugu Trendingగోపీచంద్‌ అక్కగా భూమిక!

గోపీచంద్‌ అక్కగా భూమిక!

11 15
టాలీవుడ్‌లో భూమిక తనదైన శైలిలో నటించి హీరోయిన్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రల ద్వారా మంచి విజయాలను అందుకుంది. కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకున్న భూమిక రీ ఎంట్రీ తరువాత అక్క .. వదిన పాత్రలలో కనిపిస్తోంది. ఆ పాత్రలకి ప్రాధాన్యత ఉంటేనే ఆమె అంగీకరిస్తుంది.

అలా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’.. ‘ సవ్యసాచి’ వంటి సినిమాల్లో నటించిన భూమిక, తాజాగా మరో సినిమాలో అక్క పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో అక్క పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో, భూమికను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!