HomeTelugu Newsఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి భారీ డీల్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి భారీ డీల్‌..!

10 17యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి భారీ​ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యుల్‌లో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించిన బృందం.. తాజాగా రెండో షెడ్యుల్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది.

ఈ సినిమా శాటిలైట్‌ హక్కులకు ఓ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీ నెట్‌వర్క్‌ సంస్థ తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్‌ హక్కులకు దాదాపు 150కోట్లను ఆఫర్‌ చేసినట్టు సమాచారం. అయితే నిర్మాత దానయ్య మాత్రం ఈ డీల్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. జక్కన్న ఈ సినిమాను డైరెక్ట్‌చేయడం, ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ హీరోలుగా ఉండటంతో ఈ రేటు పలకడం మాములు విషయమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu