HomeTelugu Trendingబిగ్‌బాస్‌: అమ్మ,అవినాష్‌లపై నోయల్‌ ఫైర్‌

బిగ్‌బాస్‌: అమ్మ,అవినాష్‌లపై నోయల్‌ ఫైర్‌

Noel serious on Avinash and
బిగ్‌బాస్‌-4 నుంచి అనారోగ్యం కారణంగా బయటికి వెళ్లిపోయాడు నోయల్. ఆయన్ని అట్నుంచి అటే ఇంటికి పంపేస్తున్నాడు బిగ్‌బాస్. దాంతో నాగార్జునతో ఈ వారం స్టేజీపైకి వచ్చాడు. స్టేజ్‌పైకి వచ్చిన నోయల్‌..ఇంట్లో ఉన్న అవినాష్, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌పై విరుచుకుపడ్డాడు. తాజాగా విడుదలైన ప్రోమో చూసిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్ ఉంటుందో అర్థమౌతుంది. అవినాష్, అమ్మను నోయల్ టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నోయల్.. అవినాష్, అమ్మను ఒక్కసారి లేని నిలబడమన్నాడు. అది కూడా ఒంటికాలిపై. కాసేపు నిల్చున్న తర్వాత నొప్పిగా ఉందా అని అడిగాడు. అవును చాలా ఉందని చెప్పాడు అమ్మ. దానికి వేయి రెట్లు ఎక్కువ నొప్పి తాను ఇంట్లో ఉన్నపుడు భరించానని చెప్పుకొచ్చాడు నోయల్.

దానిపై మీరు ఇద్దరూ కలిసి కామెడీ చేస్తారా అంటూ సీరియస్ అయ్యాడు. అవినాష్ తనను ఇమిటేట్‌ చేస్తావా.. నువ్వు.. ఏంటి కామెడీ చేస్తున్నారా.. మీరేమైనా జోకరా అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో ఒక్కసారిగా బిగ్ బాస్ వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఇదంతా గమనిస్తున్న నాగ్‌ సైలెంట్‌గా ఉండిపోయాడు. నోయల్ మాటలు విన్న అవినాష్ చాలా సీరియస్ అయ్యాడు. నువ్వు వెళ్తూ వెళ్తూ ఇద్దర్నీ బ్యాడ్ చేయాలని ఫిక్సైపోయావ్ అంటూ అరిచాడు. దాంతో వెంటనే యాక్టింగ్ ఆపు అవినాష్ అంటూ నోయల్ వేలు చూపించాడు. ఏమౌతుందో చూడాలి అంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!