HomeTelugu Big Storiesవేశ్య పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ

వేశ్య పాత్రలో బిగ్ బాస్ బ్యూటీ

Bigg boss fame Nandini raiసినిమాల్లో స్టార్‌ హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడూ వేశ్య పాత్రల్లో నటించడం చూశాం. తాజాగా తెలుగు బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా వేశ్యగా పాత్రలో నటించింది. ఈమె ప్రస్తుతం సినిమాల్లో కంటే కూడా వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడే వరస అవకాశాలు వస్తున్నాయి ఈ అమ్మడుకి. అందుకే బుల్లితెరపైనే ఫిక్స్ అయిపోతుంది నందిని. ఇప్పుడు కూడా ఈమె ఓ సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మెట్రో కథలు అనే వెబ్ సిరీస్‌లో నందిని వేశ్యగా నటించింది. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ ఆహా యాప్‌లో ఇది ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వస్తుంది. అందులో నందిని రాయ్ కూడా చాలా బోల్డుగా నటించింది. సిన్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, రాజీవ్ కనకాలతో పాటు మరికొందరు పాపులర్ నటులు కూడా ఇందులో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!