బోయపాటి సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూసెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం.. “బ్యాంకాక్ లో 30 రోజులపాటు జరిగిన భారీ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతోపాటు రెండు పాటలను కూడా తెరకెక్కించడం జరిగింది. ఈ షెడ్యూల్ లో చిత్ర కథానాయకుడు సాయిశ్రీనివాస్ తోపాటు కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ మరియు ముఖ్యపాత్రధారులైన జగపతిబాబు, శరత్ కుమార్ లు పాల్గొన్నారు. సరైనోడు లాంటి సూపర్ సక్సెస్ అనంతరం బోయపాటి మార్క్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. సాయిశ్రీనివాస్ స్టైలిష్ లుక్ కి మంచి ఆదరణ లభించింది. మా దర్శకుడు బోయపాటి ప్లానింగ్, మా ఆర్టిస్టులు అందించిన సహకారం వల్ల అనుకొన్న సమయంలో బ్యాంకాక్ షెడ్యూల్ ను ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా పూర్తి చేయగలిగాం” అన్నారు.