బ్రహ్మీ ఈజ్ బ్యాక్‌.. వెంకన్నను దర్శించుకున్న కామెడీ కింగ్.. వీడియో

నవ్వుల రారాజు బ్ర‌హ్మానందానికి ఉన్న‌ట్లుండి ఆ మ‌ధ్య హార్ట్ ఎటాక్ రావ‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది. అస‌లు ఆయ‌న‌కు ఏమైంది అనే ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపించింది. ఆరోగ్యంగా క‌నిపించిన బ్రహ్మానందంకు హార్ట్‌ సర్జరీ ఏంటి అని అంతా షాక్ అయ్యారు. ఈయ‌న ఆరోగ్యంపై ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తూనే ఉంది. అయితే ఇప్పుడు బ్రహ్మానందం చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌ముఖులు అంతా వెళ్లి బ్ర‌హ్మానందాన్ని ఒక్కొక్క‌రుగా క‌లుస్తున్నారు.

సంక్రాంతి పండ‌గ రోజే ఆయ‌న‌కు ముంబైలోని ఏషియ‌న్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్లో గుండె ఆపరేషన్ పూర్త‌యింది. అప్ప‌ట్నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు బ్ర‌హ్మి. ఇక ఈ మ‌ధ్యే మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డానికి కూడా రెడీ అయ్యాడు కామెడీ కింగ్. ఇదిలా ఉంటే తాజాగా ఈయ‌న తిరుమ‌ల‌కు వ‌చ్చాడు. అక్క‌డే నాగ చైత‌న్య‌, స‌మంత‌తో క‌లిసి ఫోటోల‌కు పోజులిచ్చాడు బ్ర‌హ్మానందం. ప్ర‌త్యేకంగా స్వామివారి ద‌ర్శ‌నం చేసుకున్నాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన బ్ర‌హ్మిని చూసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

బ్రహ్మానందం మున‌ప‌టి కంటే చాలా ఆరోగ్యంగా క‌నిపిస్తున్నాడు. త‌ను బాగానే ఉన్నాన‌ని.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతాన‌ని చెబుతున్నాడు బ్ర‌హ్మానందం. ఈ సంద‌ర్భంగానే స్వామి వారి ఆశీస్సుల కోసం వ‌చ్చాన‌ని చెప్పాడు ఈయ‌న‌. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మానందం మ‌ళ్లీ సినిమాల్లో బిజీ కావాల‌ని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.