‘మజిలీ’పై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హీరోయిన్‌ సమంత కన్నా హీరో, ఆమె భర్త నాగచైతన్య ఎక్కువగా నచ్చారట. ‘మజిలీ’ కొత్త ట్రైలర్‌ చూసిన వర్మ ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. ‘నాగచైతన్య.. ట్రైలర్‌లో సమంత కన్నా నాకు నువ్వే ఎక్కువగా నచ్చావు. ఇలా చెప్పానని నన్ను మరోలా అనుకోకండి. ఇది నిజం’ అని వర్మ పోస్ట్‌ చేశారు. వెంటనే ఆయన ట్వీట్‌కు చైతన్య రిప్లై ఇచ్చారు. ‘మంచిది రామ్‌గోపాల్‌ వర్మ.. ఏదేమైతేనేం మనమంతా సంతోషించాల్సిన విషయమేగా.. చీర్స్‌’ అని పోస్ట్‌ చేశారు. అయితే వర్మ తన ట్వీట్‌ను కాసేపటికి డిలీట్‌ చేశారు.

‘మజిలీ’ సినిమాలో చైతన్య, సామ్‌ భార్యాభర్తల పాత్రలు పోషించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించింది. గోపీ సుందర్‌ బాణీలు అందించారు. ఏప్రిల్‌ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. కేవలం 12 గంటల్లోనే దాదాపు 15 లక్షల మంది ట్రైలర్‌ను చూడటం విశేషం.

CLICK HERE!! For the aha Latest Updates