గడ్డంతో చరణ్ న్యూ లుక్!

రీసెంట్ గా చరణ్ నటించిన ‘ధృవ’ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. చరణ్ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సక్సెస్ ‘ధృవ’ రూపంలో అతనికి అందింది. దీంతో ఇక సినిమాల్లో తన జోరు చూపించడానికి రెడీ అయిపోతున్నాడు చరణ్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా
చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సరికొత్త ప్రేమ కథతో పూర్తి గ్రామీణ నేపధ్యంలో ఈ కథ సాగుతుంది.

సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమాకు లొకేషన్స్ ను వెతికే పనిలో పడ్డారు. ధృవ సినిమాలో చాలా స్టైలిష్ గా, సిక్స్ ప్యాక్ తో కనిపించిన చరణ్, సుకుమార్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో.. అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వాళ్ళు ఆశించినట్లుగానే ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడట. కాస్త గడ్డం పెంచి, కొత్త హెయిర్ స్టైల్ తో డిఫరెంట్ లుక్ లో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు.

దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జనవరి నెల నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.