HomeTelugu Trendingఉస్తాద్... నిన్ను బాగా మిస్ అవుతున్నాం:ఛార్మి

ఉస్తాద్… నిన్ను బాగా మిస్ అవుతున్నాం:ఛార్మి

Charmy kaur tweet on ram po

హీరోయిన్‌ ఛార్మి ప్రస్తుతం.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాతోనే టాలీవుడ్‌లో తిరిగి ఈ ఇద్దరి హవా మొదలైంది.

నేడు (మే 15) హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా.. ఛార్మి కామెంట్స్ చేసింది. ‘ఉస్తాద్… నిన్ను బాగా మిస్ అవుతున్నాం’ అంటూ రామ్, పూరిలతో కలిసి దిగిన పిక్ షేర్ చేసింది. ”మన కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు ఎంతో సరదగా గడిపాం. లెట్స్ సెలబ్రేట్ సూపర్ సూన్” అంటూ రామ్ పోతినేనికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఛార్మి. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి రామ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఆయనకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. కాగా రామ్ ప్రస్తుతం తన 19వ సినిమాను లింగుస్వామి డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ మూవీలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!