HomeTelugu Newsకాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక దృష్టి.. పనులను పరిశీలించిన కేసీఆర్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక దృష్టి.. పనులను పరిశీలించిన కేసీఆర్‌

3 3తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జగిత్యాల జిల్లా రాంపూర్‌ చేరుకున్న ఆయన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పంప్‌హౌస్‌ను పరిశీలించారు. పనుల పురోగతిపై నవయుగ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావుతో సీఎం మాట్లాడారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ పాయింట్‌ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. పెండింగ్‌ పనుల పూర్తికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బ్యారేజి పనులను దాదాపు 90శాతం వరకు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలంటి మేడిగడ్డ బ్యారేజి పనులను రెండు వారాల వ్యవధిలో సీఎం పరిశీలించడం ఇది రెండో సారి. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సీఎంతో పాటు కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం.. అక్కణ్నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయానికి, అటు తర్వాత నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu