చరణ్, పవన్ ల సినిమాలు ఒకేరోజు..?

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ తొందరలోనే ప్రారంభించి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దసరా నాటికి రిలీజ్ చేయాలని చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే అదే సమయంలో చరణ్ కు పోటీగా పవన్ సినిమా కూడా విడుదల కానుందని టాక్. పవన్ కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మార్చి నుండే త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

ఈ సినిమాను కూడా దసరాకు రిలీజ్ చేయాలనేది చిత్రబృందం ప్లాన్. మరి అనుకున్నట్లుగానే రెండు సినిమాలు ఒకేసారి వస్తే చరణ్ సినిమాకు ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా పవన్ రాజకీయాల కారణంగా షూటింగ్ గనుక లేట్ చేస్తే అప్పుడు అనుకున్న డేట్ కు వచ్చే అవకాశాలు ఉండవు. మరి ఏం జరుగుతుందో.. చూడాలి!