HomeTelugu Big Storiesభారత్‌లో 3072కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

భారత్‌లో 3072కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

15 1
దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య శనివారం సాయంత్రానికి 3072కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కరోనా బారిన పడి భారత్‌లో 75 మంది మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా విస్తరించింది. మరోవైపు ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 213 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 490 మంది ఈ కరోనా బారిన పడ్డారు. 24 మంది మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం సాయంత్రం వరకు 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 12 కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కరోనా కేసులు నమోదు కాగా, గుంటూరులో 30, కృష్ణా జిల్లా 28, కడప -23, ప్రకాశం 21, విశాఖ 15, ప.గో 15, తూ.గో 11, చిత్తూరు 10, కర్నూలు 4, అనంతపురం 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కి చేరింది. ఇవాళ మరో 43 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి కోలుకుని ఇవాళ ఒకరు డిశ్చార్జి అయ్యారు. దీంతో తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33కి చేరినట్లు ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 11 మంది మృతిచెందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu