HomeTelugu Big Storiesతెలంగాణలో రెండురోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో రెండురోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు

8 9
తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయనుకుంటే రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 31 కేసులు నమోదు కాదా, ఇవాళ మరో 33 కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో తెలంగాణలో 30 మంది మృతిచెందారు. గత రెండు రోజులుగా నమోదవుతున్న కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవాళ్టి 33 కేసుల్లో 26 కేసులు హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. ఇప్పటి వరకు 751 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 415 మంది చికిత్సపొందుతున్నారు.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలు కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్ అర్బన్, నిర్మల్ జిల్లాలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!