HomeTelugu NewsDiwali releases 2024: సందడి చేయనున్న భారీ సినిమాలు ఏమిటో తెలుసా!

Diwali releases 2024: సందడి చేయనున్న భారీ సినిమాలు ఏమిటో తెలుసా!

Diwali releases 2024

Diwali releases 2024: టాలీవుడ్​లో పండగలకు, వేసవి సెలవులకు సినిమాలు ఎక్కువ విడుదల అవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది సమ్మర్‌కు ఆ సందడి కనిపించలేదు. ‘టిల్లు స్క్వేర్’ మూవీతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వేసవి కానుకగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ పెట్టిన బడ్జెట్ కలెక్షన్స్ కూడా పెద్దగా హిట్‌ కాలేదు. ఇక ప్రభాస్ కల్కి కూడా ఎన్నికల దెబ్బ పడేలా ఉందని విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్‌. ఎన్టీఆర్ దేవర కూడా సమ్మర్ నుంచి దసరా పండగకు వాయిదా పడింది. ఇక టాలీవుడ్ భారీ హిట్ కోసం మళ్లీ పండగ సీజన్ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ దీపావళికి మాత్రం పలు భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.

గేమ్ ఛేంజర్:
ఈ లిస్ట్‌లో ఉన్న ఫస్ట్‌ మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’. తమిళ డైరెక్టర్ శంకర్ దీన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో.. ఓ తెలుగు హీరోతో స్ట్రైయిట్ సినిమా చేయడం ఇదే తొలిసారి. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ చివరిలో విడుదల కానుంది. అంటే ఈ దీపావళికి ముందే థియేటర్లో విడుదల కానుంది.

కంగువ:
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బజ్డెట్‌ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ సినిమాను మగధీర తరహాలో తెరకెక్కనున్నారు. సిరుత్తై శివ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దీపావళి బరిలోనే దిగుతున్నట్లు సమాచారం.

వెట్టయన్:
ఇక ఈ దీపావళికి రాబోతున్న మరో పెద్ద సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ దీపావళికి సత్తా చాటేందుకు రజనీకాంత్‌ రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ సినిమాలు
ఇక దీపావళిని టార్గెట్ చేస్తూ రెండు బాలీవుడ్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి సింగం ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ‘సింగం ఎగైన్’. మరొకటి ‘భూల్ భూలయ్యా 3’. ఈ రెండు ఫ్రాంచైజీలకు ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది.

సింగం ఎగైన్:
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్లు అంతా కలిసి నటిస్తున్న చిత్రం ‘సింగం ఎగైన్’. మసాలా ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

భూల్ భూలయ్యా 3:
ఈ సినిమాను దీపావళి సీజన్‌కే విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, త్రిప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండవ భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీ ఈ మూడో పార్ట్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో.. గేమ్ ఛేంజర్, కంగువ సినిమాలపై భారీ బజ్ ఉంది. మరి వీటిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu