HomeTelugu Big Storiesగాడ్ ఫాదర్ : టైటిల్‌ సాంగ్‌ విడుదల

గాడ్ ఫాదర్ : టైటిల్‌ సాంగ్‌ విడుదల

Godfather Title Song Lyrics
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. అక్టోబరు 5న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా టైటిల్ సాంగ్ నేడు విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘తార్ మార్ తక్కర్ మార్’, ‘నజభజ జజర’ పాటలు ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మోహన్ రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్, నయనతార, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu