
SSMB29 update:
ఎస్ఎస్ రాజమౌళి – ఈ పేరు వింటేనే కళ్లముందు బాహుబలి, RRR లాంటి విజువల్ వండర్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన మరోసారి భారత సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన తదుపరి చిత్రం SSMB29. ఇందులో హీరోగా మహేశ్ బాబు కనిపించబోతున్నారు. ఇది అడవిలో సాగే అడ్వెంచర్-ఆక్షన్ కథతో తెరకెక్కుతుంది.
ఈ సినిమా కోసం ఏకంగా రూ. 1000 కోట్లు బడ్జెట్ కేటాయించడం అసాధారణ విషయం. ఇప్పటికే ఒడిశాలో షూటింగ్ పూర్తి అయింది. మహేశ్ బాబు తన కుటుంబంతో చిన్న వెకేషన్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్‌లో స్పెషల్ సెట్స్‌లో షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ సీన్‌లో 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు!
ఇదే సమయంలో రాజమౌళి పారితోషికం కూడా రికార్డు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమాకు ఆయనకు రూ. 200 కోట్లు రెమ్యూనరేషన్‌గా చెల్లిస్తున్నారు. ఇది హీరో మహేశ్ బాబు కంటే ఎక్కువ! అంతేకాదు, సినిమాతో వచ్చే లాభాల్లోనూ షేర్ ఉండే అవకాశం ఉంది. ఈ వివరాలతో చూస్తే, రాజమౌళి ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు అని చెప్పొచ్చు.
ఇందులో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాప్ స్టార్లు నటిస్తున్నారు. SSMB29 సినిమా 2027 సమ్మర్‌లో విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో ఉండబోతోంది!
ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్‌కి చాలా ఎగ్జైట్ అయ్యారు. రాజమౌళి మార్క్ యాక్షన్, విజువల్స్, కథనం వంటివి… సినిమా థియేటర్‌లో చూడాలంటే ఓ భారీ అనుభూతి గ్యారంటీ అనుకోవచ్చు.
ALSO READ: Akhanda 2 కి బాలయ్య రెమ్యూనరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే













