HomeTelugu Trendingరేపే హీరో నిఖిల్‌ పెళ్లి ..

రేపే హీరో నిఖిల్‌ పెళ్లి ..

5 12
టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ వివాహం కుదిరి చాలా రోజులైంది. కానీ, లాక్‌డౌన్ కారణంగా రెండు సార్లు వాయిదా పడింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు నిఖిల్. కానీ లాక్‌డౌన్ అడ్డుపడుతూ వచ్చింది. లాక్‌డౌన్ ఇంకా కొనసాగుతుంది ఉందని తేలియడంతో… లాక్‌డౌన్ లోనే వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ హీరో.

కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నాడు. రేపు అంటే గురువారం రోజున హీరో నిఖిల్ సిద్దార్ధ్, డాక్టర్ పల్లవి వర్మల వివాహం జరగబోతున్నది. రేపు ఉదయం 6:31 గంటలకు హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న ఓ ప్రైవేట్ విల్లాలో వివాహం జరగబోతున్నది. ఈ వివాహం కోసం ఇప్పటికే అనుమతి తీసుకున్నారు. సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి చేశారు. 30 మంది వరకు ఈ వివాహానికి హాజరుకాబోతున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!