ప్రభాస్‌కు రానా బర్త్‌డే విషెస్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు సందర్భంగా.. టాలీవుడ్‌ నుండి విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్‌ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్‌ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్‌ తెలిపారు. “జన్మదిన శుభాకాంక్షలు సోదరా… నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్‌ యూ” అంటూ రానా ప్రభాస్‌కు విషెస్‌ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్‌ మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు.

CLICK HERE!! For the aha Latest Updates