ఊపిరి.. నాగ్‌, ఎన్టీఆర్‌లను అనుకున్నాడట

అక్కినేని నాగార్జున కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఊపిరి ఒకటి. ఫ్రెంచ్ లో విడుదలై సూపర్ హిట్టైన ది ఇన్ టచబుల్ సినిమాను తెలుగులో ఊపిరిగా రీమేక్ చేశారు. ఈ సినిమాను మొదట నాగార్జున.. ఎన్టీఆర్ లతో చేయాలని అనుకున్నాడట వంశీ. కానీ, అప్పటికే ఎన్టీఆర్ వేరే సినిమాలకు కమిట్ కావడంతో నెక్స్ట్ ఆప్షన్ గా కార్తీని తీసుకున్నట్టు వంశీ చెప్పారు.

కార్తీని తీసుకోవడం వలన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేసే అవకాశం దొరికిందని.. రెండు చోట్ల సినిమా మంచి విజయం సాధించిందని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మహర్షి సినిమా కథను స్పైడర్, భరత్ అనే నేను సినిమా సమయంలోనే చెప్పానని, అయితే, అప్పుడు మహేష్ ఆ రెండు సినిమాల హడావుడి లో ఉండటం వలన చేయలేకపోయినట్టు తెలిపారు. 25 వ సినిమాగా చేయడం తన అదృష్టం అని వంశి చెప్పడం విశేషం.