నితిన్ ఆఫీస్ పై ఐటీ దాడులు!

ఐటీశాఖ అధికారులు మరోసారి తెలుగు ఇండస్ట్రీకు సమబంధించిన నిర్మాతల ఆఫీసులపై దాడి చేశారు. యంగ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పలు చిత్రాలకు పని చేశారు. రీసెంట్ గా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఒక్క
ఏరియాలో శాతకర్ణి 10 కోట్ల కలెక్షన్స్ సాదించింది.

అయితే ఆధాయానికి సంబంధించిన వివరాలను సుధాకర్ రెడ్డి ఐటీ డిపార్ట్మెంట్ కు సరిగ్గా అందివ్వలేదు. దీంతో హఠాత్తుగా ఈరోజు ఐటీ అధికారులు సుధాకర్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సుధాకర్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే బాహుబలి నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిగిన సంగతి తెలిసిందే!