HomeTelugu Trendingజబర్దస్త్ బ్యూటీకి కరోనా, పరిస్థితులపై ఎమోషనల్

జబర్దస్త్ బ్యూటీకి కరోనా, పరిస్థితులపై ఎమోషనల్

Jabardasth varsha corona

కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని పట్టుకుని వేధిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోని కొందరు సెలబ్రిటీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు సైతం వాయిదా పడుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి బుల్లితెర నటులనూ వేధిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ వర్ష కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. రెండు రోజులుగా ఆరోగ్యం బాగా లేదని, కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. తన ఫాలోవర్లకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని కరోనాతో చనిపోయిన వారిని ప్యాక్ చేసి పడేస్తున్నారని అందుకే లైవ్‌లోకి వచ్చి చెప్పాల్సి వస్తోందని వర్ష ఆవేదన వ్యక్తం చేసింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వేడినీళ్లు మాత్రమే తాగాలని సూచనలు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu