జై బాలయ్య జైజై బాలయ్య అంటూ ఎన్టీఆర్‌ నినాదాలు.. వైరల్‌..!

స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుక జైపూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రామ్ చరణ్, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, నాగార్జున, అఖిల్ ఇలా చాలామంది హాజరయ్యారు. వేడుకలో సంగీత్ లాంటి వేడుకలు హోరెత్తాయి. మన హీరోలంతా హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్సులు కూడ వేశారు. ఒక పార్టీలో తారక్ అయితే ఏకంగా జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.