యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో.. జ్యోతిక, లక్ష్మి ‘జిమ్మికి కమల్‌’

నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. హిందీలో విజయం సాధించిన ‘తుమ్హారి సులు’కు తమిళ రీమేక్‌ ఇది. జ్యోతిక స్నేహితురాలిగా మంచు లక్ష్మి నటించారు. ఆ చిత్రంలో తమిళ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. రాధామోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ధనుంజేయన్‌ నిర్మించారు. ఎ.ఆర్‌‌ రెహమాన్‌ కుటుంబానికి చెందిన ఎ.హెచ్‌ కాశిఫ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో జ్యోతిక లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో సందడి చేయనున్నారు. నవంబరు 16న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్న ‘జిమిక్కి కమ్మల్‌..’ పాటను ఈ సినిమాలో ఉంచారు. ఈ పాటకు జ్యోతిక, మంచులక్ష్మి కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఈ పాట వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేయగా.. యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో 50వ స్థానంలో ఉంది. 21 వేల మందికి పైగా పాట నచ్చిందని లైక్‌ చేశారు.