వరుస ఆఫర్‌లతో అఖిల్‌ హీరోయిన్‌

టాలీవుడ్ లో కేరళ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అనేక మంది కేరళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంటారు. టాలీవుడ్ లో హిట్ కొట్టారంటే… వరసగా ఆఫర్లు వస్తుంటాయి. అఖిల్ రెండో సినిమా ‘హలో’ సినిమాలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శిని కూడా కేరళ అమ్మాయే.

ఫస్ట్ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో అవకాశాలు వస్తాయో లేదో అనుకున్న తరుణంలో కళ్యాణికి చిత్రలహరి వచ్చింది. వరస పరాజయాలు ఎదుర్కొంటున్న హీరోతో సినిమా అయినా సరే కథను నమ్మి ఒకే చేసింది. సినిమా విజయం సాధించింది. దీంతో టాలీవుడ్ లో రెండో సినిమా హిట్ కొట్టడంతో కల్యాణికి ఆఫర్లు వస్తున్నాయి. శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న కళ్యాణి, నితిన్ తో భీష్మ చేసేందుకు సిద్ధం అయింది. ఈ రెండింటిలో ఏ సినిమా హిట్టయినా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.