“భారతీయుడు2” షూటింగ్ ఆగిందా?


రోబో 2.ఓ లాంటి గ్రాఫిక్స్‌ మాయాజాలం తరువాత శంకర్‌ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌గా “భారతీయుడు2″ను శంకర్‌ రూపొందిస్తున్నారు.

పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్‌ అకస్మాత్తుగా షూటింగ్‌ను ఆపేసినట్లు తెలుస్తోంది. అక్కడ వేసిన సెట్‌లు శంకర్‌కు సంతృప్తినివ్వలేదని, మళ్లీ సెట్‌ను రీక్రియేట్‌చేసేవరకు షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.