HomeTelugu Trending'కాంచన 3' హీరోయిన్‌ మృతి

‘కాంచన 3’ హీరోయిన్‌ మృతి

Kanchana 3 actressరాఘవ లారెన్స్‌ నటించిన ‘కాంచ‌న 3’ సినిమాలో హీరోయిన్‌, రష్యన్‌ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కాంచన 3’లో పగ తీర్చుకునే దెయ్యం పాత్ర‌లో క‌నిపించించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నారు. గోవాలో తను నివసిస్తున్న అపార్టుమెంటులో మృతి చెందడం సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆమె చనిపోవడం ఏంటని, అది కూడా మూడు రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. ఇదిలా ఉండగా అలెగ్జాండ్రా కొద్దిరోజుల కిందట తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లుగా సినీవర్గాల నుంచి సమచారం. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో గోవా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా చెన్నైలోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరిన అలెగ్జాండ్రా ఇటీవల అక్కడి ఫొటోగ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలెగ్జాండ్రా ప్రియుడితో పాటు ఫొటో గ్రాఫర్‌ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!