‘కాంచన-3’ హీరోయిన్ కి తప్పని లైంగిక వేధింపులు.. మార్ఫింగ్ ఫొటోలు లీక్‌ చేస్తానంటూ బెదిరింపులు

సినీ ఇండస్ట్రీలను ‘మీటూ’ ఉద్యమం ఒక ఊపు ఊపేసింది. అవకాశాల కోసం వచ్చిన మహిళా నటులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చాలా మంది బాధితులు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. దీనిపై అప్పట్లో పెద్ద జరిగింది. ఐనా ఇప్పటికీ పరిస్థితి మారలేదు. ఎక్కడో ఓ చోట నటీనటులపై వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా కాంచన-3 హీరోయిన్‌కు సైతం లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఫొటోషూట్ కోసం పిలిచిన ఓ ఫొటోగ్రాఫర్.. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ ఆమె వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

రష్యా మోడల్ రి డిజావి అలెగ్జాండ్రా (34) పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చింది. భర్త, పిల్లలతో కలిసి ఎంఆర్‌సీ నగర్‌లో నివసిస్తున్న ఆమె పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో కాంచన-3లో అలెగ్జాండ్రాకు అవకాశమొచ్చింది. రాఘవ లారెన్స్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన కాంచన-3లో ఓవియా, వేదిక, నిక్కి తంబోలి హీరోయిన్లుగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లారెన్స్‌కు లవర్‌గా నటించంది అలెగ్జాండ్రా. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబడుతోంది. మూవీ తర్వాత తనకు అవకాశాలు పెరుగుతాయని భావించిన అలెగ్జాండ్రాకు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ రూపేశ్ ఆమెను సంప్రదించాడు. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో తనకు సంబంధాలున్నాయని చెప్పి ఫొటో షూట్‌కు పిలిపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత పలు భంగిమల్లో తన ఫొటోలు తీశాడని.. అనంతరం బెడ్‌రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అలెంగ్జాండ్రా ఆరోపించింది. తన లైంగిక వాంఛ తీర్చాలని…లేదంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని రూపేశ్ వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ దురై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రుబేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.