HomeTelugu Trendingపనీపాటా లేని నటులు నీతులు చెప్తున్నారు.. కంగన సోదరి సంచలన వ్యాఖ్యలు

పనీపాటా లేని నటులు నీతులు చెప్తున్నారు.. కంగన సోదరి సంచలన వ్యాఖ్యలు

1 12బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. కంగన, హృతిక్‌ రోషన్‌ల సినిమా ఒకే రోజు విడుదల చేస్తున్నారన్న నేపథ్యంలో తలెత్తిన వివాదంపై కంగన సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ హృతిక్‌ను బెదిరించారు. ఆ తర్వాత హృతిక్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. వీటి గురించి నటి రిచా చద్దా ‘బై ఇన్‌వైట్‌ ఓన్లీ’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు ఎవరితోనైనా సమస్య ఉంటే పబ్లిక్‌ ప్లాట్‌ఫాంపై మాటల యుద్ధం చేయను. దానర్థం నాకు ధైర్యం లేదని కాదు. కానీ నేను నేరుగానే మాట్లాడి సాధించుకుంటాను’ అంటూ పరోక్షంగా కంగనను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు.

దీనిపై రంగోలీ స్పందిస్తూ రిచాపై మండిపడ్డారు. ‘రిచా చద్దాలాంటి వారు కంగన మాటతీరు గురించి కామెంట్‌ చేస్తూ అనవసరంగా మాటల యుద్ధానికి పోను అని అంటుంటారు. అలాంటి వారికి నా ప్రశ్న ఏంటంటే.. మాట్లాడే అవకాశం ఉందా?లేక నిజంగానే ఒంటరిగా పోరాడాలనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. తన స్వేచ్ఛ కోసం కంగన 14 ఏళ్లు కష్టపడ్డారు. కాబట్టి కంగన ఇప్పుడు ఏం మాట్లాడాలో 14 ఏళ్ల క్రితమే నిర్ణయించబడింది. కొందరు పనీపాటా లేని నటులు, మూవీ మాఫియాలు అందరి ముందు పోట్లాడద్దు అని కంగనకు నీతులు చెబుతున్నారు’ అని చురకలంటించారు.

అయితే ఈ విషయాల గురించి కంగన మీడియా ముందు మాట్లాడటం తగ్గించేశారు. ఆమె సోదరి రంగోలీనే తనకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ తన తరఫున కామెంట్స్‌ చేసేవారికి బుద్ధిచెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!