కరీనాకు బాబు పుట్టాడు!

బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఈరోజు ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ అనే హాస్పిటల్ లో ఉదయం ఏడున్నర గంటల సమయంలో కరీనాకు బాబు పుట్టినట్లు తెలుస్తోంది. ఈ బిడ్డకు సైఫ్, కరీనా జంట తైమూర్ అలీఖాన్ పటౌడి అని పేరు పెట్టారు.
సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కు సారా అలీ ఖాన్, ఇబ్రహిం అలీ ఖాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. సైఫ్ కు, కరీనాలకు ఇదే మొదటి సంతానం. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని.. తొమ్మిది నెలలుగా అభిమానం చూపిన ఆదరించిన అభిమానులకు సైఫ్, కరీనాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జంటకు బాబు పుట్టాడని తెలుసుకున్న కొందరు బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.