‘కేశవ’ సెన్సార్ పూర్తి!

నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న చిత్రం ‘కేశ‌వ‌’. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి కాళ‌భైర‌వ సాంగ్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌గా, రెండ‌వ సాంగ్ ని హీరో నిఖిల్ యుస్ లో శ్రీ సాయిద‌త్తా పీఠంలో సుమారు వెయ్య‌మంది తెలుగు సినిమా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశాడు. మే 19న సమ్మర్ కానుకగా కేశవ ప్రేక్షకులు ముందుకు రానుంది.