‘కొబ్బరి మట్ట’ సాంగ్ రిలీజ్!

సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో రూప‌క్‌రోనాల్డ్ దర్శకత్వంలో అమృత ప్రోడ‌క్ష‌న్‌, సంజ‌న మూవీస్ బ్యాన‌ర్ల పై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’. ఆది కుంబ‌గిరి, సాయి రాజేష్ నీలం లు నిర్మాతలు. ఈ సినిమాలో శంభో శివ శంభో సాంగ్ టీజ‌ర్ ని పూరిజ‌గన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ఈ సంద‌ర్బంగా పూరిజ‌గ‌న్నాధ్ మాట్లాడుతూ.. ”బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.. సంపూతో చాలా సార్లు ప‌నిచెయ్యాలి కుద‌ర‌లేదు. త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్తు లో చేస్తాను. కొబ్బ‌రిమ‌ట్ట టైటిల్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంది. ఈ చిత్రానికి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు” అని అన్నారు.
నిర్మాత‌లు మాట్లాడుతూ.. ”ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో వుంది. సంపూర్ణేష్‌బాబు గారితో మా రెండ‌వ చిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. హృదయ కాలేయం చిత్రం కంటే మూడింత‌లు నవ్వించే విధంగా స్టీవెన్ శంక‌ర్ క‌థ‌, మాట‌లు అందించగా, ద‌ర్శ‌కుడు రూప‌క్‌రోనాల్డ్ తెర‌కెక్కించాడు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా టాలీవుడ్ పెద్ద చిత్రాల‌కు ధీటుగా ముజీర్ మాలిక్ కెమెరా అందించారు. ఈ విజువ‌ల్స్ చూసిన ప్ర‌తి ఓక్క‌రూ విజువ‌ల్స్ చాలా గ్రాండియార్ గా వున్నాయని చెప్ప‌టం విశేషం” అన్నారు