HomeTelugu Trendingయంగ్‌ డైరెక్టర్ తో‌ విజయ్‌ సినిమా

యంగ్‌ డైరెక్టర్ తో‌ విజయ్‌ సినిమా

Kollywood hero vijays next
తమిళ నటుడు విజయ్‌ హీరోగా నటించనున్న’ 65 వ’ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే ఉత్కంఠకు తెరపడింది. ప్రతిష్టాత్మక చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహించనున్నట్లు సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. మొదటి చిత్రం ‘కొలమావు కోకిల’తో హిట్‌ కొట్టిన దర్శకుడు నెల్సన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా చిత్ర దర్శకుడు నెల్సన్‌ సినిమాకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. నా తదుపరి చిత్రం విజయ్‌తో చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉందని.. ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ర్‌గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం 2021 సంక్రాతికి విడుదలకు సిద్ధంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!