వర్మ ‘భైరవ గీత’ న్యూ రిలీజ్ డేట్‌..!

‘ఆఫీసర్’ సినిమాతో ప్రేక్షకుల్ని చివరిగా పలకరించిన వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తూ చేసిన చిత్రం ‘భైరవ గీత’. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేశాడు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఇది వరకే విడుదలకావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వలన అది కాస్త వాయిదాపడుతూ వచ్చింది.

తాజాగా వర్మ ఈ సినిమాను నవంబర్ 22న విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లోను సినిమా ఒకేసారి విడుదలకానుంది. ఇందులో కన్నడ నటుడు, ఇటీవలే ‘తగరు’ సినిమాతో బాగా పాపులర్ అయిన ధనంజయ హీరోగా, ఇర్ర మోర్ హీరోయిన్ గా నటించారు.