చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్!

రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో క్రిష్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాం ‘ఖబడ్ఢార్’ అంటూ హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో క్రిష్, చిరంజీవిని ఉద్దేశించే ఆ పదాన్ని ఉపయోగించారంటూ.. మెగాభిమానులు ఆయనపై మండిపడ్డారు. దీంతో క్రిష్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు.. ఖబడ్ఢార్ అనే పదానికి కొత్త అర్ధాలు వెతికి గొడవ చేయకండి.

నేను కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి తరఫున ఆ మాట అన్నాను. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదనే ఉద్దేశంతో తెలుగు ప్రజల బాధను వ్యక్తం చేశాను. మెగా హీరోలను ఉద్దేశించి అలా మాట్లాడానని వక్రీకరించి రాయొద్దని తెలిపారు. మెగాకుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. బన్నీతో ‘వేదం’, వరుణ్ తేజ్ తో ‘కంచె’ సినిమాలు చేయడం ఆ అనుబంధంతోనే కుదిరిందని అన్నారు. చిరంజీవి గారు నా ఇన్స్పిరేషన్. కంచె సినిమాలో ప్రతి సన్నివేశం గురించి ఆయనతో తనతో మాట్లాడారని క్రిష్ వెల్లడించారు.