HomeTelugu Big Storiesజనసేన చెప్పే మార్పు మొదలైంది: పవన్‌ కల్యాణ్‌

జనసేన చెప్పే మార్పు మొదలైంది: పవన్‌ కల్యాణ్‌

11 17జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. జనసేన చెప్పే మార్పు మొదలైందని.. దాన్ని కొనసాగిద్దామని అన్నారు. ఆదివారం గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ వలే జనసేన సీట్ల లెక్క వేయదన్నారు. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకమవ్వాలని శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి గురించి మాత్రమే నాయకుల్ని అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.

మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దిశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని ఈ సందర్భంగా పవన్‌ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని నేతలతో అన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమస్య పెద్దదైతే తానూ స్పందిస్తానని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు కొనసాగించాలని సూచించారు. గ్రామస్థాయిలో సమస్యల పట్టిక సిద్ధం చేయాలన్నారు. భయం, అభద్రతా భావాన్ని దాటుకొని వచ్చిన యువశక్తి తమతో ఉందన్నారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని, ఈ అంశంపైనే పోరాటం చేద్దామని నేతలకు పవన్‌ సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu