‘మహర్షి’ సెలబ్రేషన్స్‌ లో..మహేష్‌ ఫ్యామీలీ జర్మనీ నుండి ఇటలీకి!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ‘మహర్షి’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన తరవాత చిత్ర యూనిట్, ఫ్యాన్స్‌తో కలిసి విజయోత్సవాలు చేసుకున్న మహేష్ బాబు.. ఆ తరవాత సమయాన్ని తన కుటుంబానికి కేటాయించారు. గత నెల 20న భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు. అయితే, విహార యాత్రకు ఎక్కడికి వెళ్తున్నది చెప్పలేదు. కానీ, తాజాగా చేసిన ట్వీట్‌లో తన విదేశీ పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు మహేష్.

సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ.. ‘జర్మనీలో అద్భుతంగా గడిపాం!! ఇప్పుడు ఇటలీకి వెళ్తున్నాం. సెలబ్రేటింగ్ మహర్షి’ అని పేర్కొన్నారు. మొత్తం మీద ‘మహర్షి’ ప్రమోషన్లతో అలసిపోయిన మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో జాలీగా హాలీడేను గడుపుతున్నారు.