‘మహర్షి’.. ‘ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వే వచ్చి..’ సాంగ్‌ చూశారా?

‘కల కనే కళలకే కనులనే ఇవ్వరా.. ఇది కల కాదని రుజువునే చూపరా..’ అని మహేశ్‌ బాబుతో అంటున్నారు పూజా హెగ్డే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమాలోని ఓ పాట వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘ఎవరెస్ట్‌ అంచున పూసిన రోజా పువ్వే వచ్చి నవ్వే విసిరిందే..’ అని సాగిన ఈ పాటను పూజ, మహేశ్‌లపై చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ గీతం యూట్యూబ్‌లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ట్విటర్‌లో EverestAnchuna అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శ్రీమణి సాహిత్యం సమకూర్చారు.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్‌ స్నేహితుడి పాత్రలో ‘అల్లరి నరేష్‌’ నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.