‘2.ఓ’ ఓ సినిమాటిక్‌ జెమ్: మహేష్‌

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 2.ఓ ఫీవర్‌ కనిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో ఈ విజువల్‌ వండర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తరుణ్‌ ఆదర్శ్‌, రమేష్‌ బాలా, శ్రీధర్‌ పిల్లై లాంటి విమర్శకులు సైతం సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.

తాజాగా టాలీవుడ్ నటులు సైతం 2.ఓ సినిమాపై ట్వీట్లు చేస్తూ మరింత హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే నాని, అల్లరి నరేష్ లాంటి హీరోలు ఆసక్తికరమైన ట్వీట్స్‌తో ఆకట్టుకోగా ఇప్పుడు మహేష్ బాబు కూడా 2.ఓ చిత్రయూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘2.ఓ’ ఓ సినిమాటిక్‌ జెమ్‌. ఈ సినిమా మీకు గతంలో ఎప్పుడూ పరిచయం లేని ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుంది. శంకర్‌ సార్‌ మీరు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. రజనీకాంత్ సర్‌, అక్షయ్‌ కుమార్‌, 2.ఓ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు టాలీవుడ్‌ హీరో మహేష్‌ బాబు.