HomeTelugu Trendingబెడ్‌రూంలో సెలబ్రిటీతో మంచులక్ష్మి

బెడ్‌రూంలో సెలబ్రిటీతో మంచులక్ష్మి

5 13

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో చాలా మంది ఇంట్రస్ట్‌ చూప్తిస్తారు. ముఖ్యంగా సినిమా తారలపై ఉన్న ఆరాధనాభావంతో వాళ్లకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అభిమానం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు..తమ అభిమాన హీరోహీరోయిన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అనే విషయాల గురించి కూడా ఫ్యాన్స్‌ ఆలోచిస్తుంటారు. సాధారణంగా అయితే తారలకు సంబంధించిన డే టైమ్‌ ముచ్చట్లు అందరికీ తెలిసిపోతాయన్న సంగతి తెలిసిందే. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది.. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అలాంటి వారికోసం బాలీవుడ్‌లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్‌గా ఉండే ఎన్నో విషయాలను ఫిల్మ్‌ స్టార్లు ఈ కార్యక్రమంలో షేర్‌ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు.

మంచు లక్ష్మి హోస్ట్‌గా వయాకామ్ 18 ఈ క్రేజీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నాను. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ భావాలను, రహస్యాలను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. అభిమాన తారలను ఫ్యాన్స్‌కు దగ్గరగా చేస్తూ వినోదాత్మకంగా సాగి పోయే విధంగా షోను నడిపించేందుకు ప్రయత్నిస్తాను. సెలబ్రిటీల్లో నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం ప్రేక్షకులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాతో పాటు.. సెలబ్రిటీలకు కూడా ఇదో సరికొత్త అనుభవంగా మారబోతోంది’ అన్నారు. కాగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షో కోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్వ్యూలు సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నామని వయాకామ్ 18 ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu