మనోజ్ ఇంత చేసింది టీజర్ కోసమా!

నిన్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు మంచు మనోజ్. ఉదయాన్నే ఇక సినిమాలకు గుడ్ బై అంటూ ఓ ట్వీట్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే దీనివెనుక వేరే కారణం ఉంటుందని అందరూ ముందే ఊహించారు. దానికి తగ్గట్లుగానే మనోజ్ ఆ ట్వీట్ ను తీసేసి, నా కామెంట్ ను అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఒకటి చెప్పాలనుకుంటే.. ఇంకేదో.. అర్ధమయిందంటూ.. మాట మార్చేశాడు. అయితే దీని వల్ల మనోజ్ తన క్రెడిబిలిటీను కొంతవరకు కోల్పోయాడు. అయితే ఒక విషయంలో మాత్రం మనోజ్ సక్సెస్ అయ్యాడు. బుధవారం మొత్తం సోషల్ మీడియా తన వైపుకి తిప్పుకున్నాడు మనోజ్. దీంతో సాయంత్రం విడుదల చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ జనంలోకి బాగా వెళ్లింది.
ఈ సినిమాలో మనోజ్ ఎల్.టి.టి.ఎ చీఫ్ దివంగత ప్రభాకరన్ గెటప్ లో అలానే మామూలు కుర్రాడిగా మరో పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. పొద్దుట మనోజ్ ట్వీట్ లేకుండా.. ‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ విడుదల చేసి ఉంటే అన్ని సినిమాల టీజర్స్ లానే వచ్చి వెళ్లిపోయేది. మనోజ్ తన సినిమా టీజర్ పై అందరూ ఫోకస్ పెట్టాలనే ఇలా ట్వీట్ చేసి ఉంటే మాత్రం తను అనుకున్నది సాధించాడనే చెప్పాలి. కానీ దానికోసం ఇంత గోల చేయాలా..? మనోజ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.