HomeTelugu Trendingఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్న మంచు ఫ్యామిలీ.. నెటిజన్ల ప్రశంసలు

ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్న మంచు ఫ్యామిలీ.. నెటిజన్ల ప్రశంసలు

10 6

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దానితో వారి సాయం చేయాడానికి అనేక స్టార్లు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, డైలాంగ్‌ కింగ్‌ మోహన్‌బాబు, ఆయన కుటుంబం కలిసి ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు వీరు అండగా నిలిచారు. అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్యామీలిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోహన్‌బాబు చిత్తూరులోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలోని రంగపేట సమీపంలో ఆయన ‘శ్రీ విద్యానికేతన్‌’ పేరుతో విద్యా సంస్థల్ని స్థాపించారు.

తమిళ స్టార్‌ అజిత్‌ కరోనాపై పోరుకు రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో రూ.50 లక్షలు పీఎం-కేర్స్‌కు, రూ.50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి, రూ.25 లక్షలు ‘ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’కు విరాళంగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu