విజయ్‌ ‘మాస్టర్’ సీన్స్ లీక్

తమిళ హీరో విజ‌య్ నటించిన ‘మాస్టర్’ సినిమా జ‌న‌వ‌రి 13న పెద్ద ఎత్తున విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో రిలీజ్‌ కాబోతున్న భారీ చిత్రం ‘మాస్టర్’ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ చిత్రం విడుదలకు కొద్దిగంట‌ల ముందు పైర‌సీ బారిన ప‌డింది. ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో కోలీవుడ్‌ ఉలిక్కిప‌డింది. కాగా, మాస్టర్ సినిమా పైరసీపై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ భావోద్వేగం చెందారు. ‘మాస్ట‌ర్ సినిమా కోసం ఏడాదిన్న‌రగా క‌ష్టప‌డ్డాం.. సినిమాను థియేట‌ర్స్‌లో చూసి సంతోషిస్తార‌ని ఆశిస్తున్నాం. ఎవ‌రి ద‌గ్గ‌రైన మాస్ట‌ర్ సినిమాకు సంబంధించిన లీక్ వీడియోలు ఉంటే దయచేసి షేర్ చేయోద్దని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా పైరసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates