ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌.. ఫొటో వైరల్‌


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన కజిన్స్‌తో దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎపుడు ఎంత బిజీగా ఉన్న మనిషీ జీవితంలో కుటుంబం, స్నేహితుల విలువ వెలకట్టలేనందూ మెసేజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన చెల్లెల్లు శ్రీజ, నిహారికలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సందడి చేసిన ఫోటోలను షేర్ చేసాడు. మెగా ఫ్యామిలీ విషయానికొస్తే.. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలే వచ్చారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు హీరోలుగా ఉన్నారు. మరోవైపు నాగబాబు జబర్దస్త్ కామెడీ షో హోస్ట్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక నిహారిక, కళ్యాణ్ దేవ్ సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టని పరీక్షించుకుంటున్నారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రామ్ చరణ్ తేజ్.. షేర్ చేసిన పిక్‌లో వైష్ణవ్ తేజ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీకి చెందిన అందరు ఉన్నారు. ఈ ఫోటోలను షేర్ చేసిన రామ్ చరణ్.. దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడంలో ఉన్న సంతోషం మరెక్కడా ఉండదన్నారు. మనిషి జీవితంలో ఆనందానికి ముఖ్యమైన సోర్స్ ఇదే అని చెప్పుకొచ్చాడు. ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసిన మెగాభిమానుల ఆనంద పడుతున్నారు.