మెగాస్టార్‌తో అర్జున్‌ రెడ్డి దర్శకుడు..

మెగాస్టార్ చింరజీవితో సినిమా చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అవకాశం దొరికిన ఆ కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటారు. ఛాన్స్ ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోరు. మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమాలు వరసగా హిట్ అవుతున్నాయి. మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్టైంది. ఈ సినిమా తరువాత చేసిన 151 వ సినిమా సైరా సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మెగాస్టార్ ఈ సినిమాలో నటవిశ్వరూపం చూపించారు. పాన్ ఇండియా మూవీగా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్ కొరటాలతో సినిమా చేస్తున్నారు. నవంబర్ నుంచి సినిమా స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉంటె, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నారట. త్వరలోనే ఆ కథను మెగాస్టార్ కు వినిపించబోతున్నారట. మెగాస్టార్ ఒకే అంటే తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తారట. మరి సందీప్ చెప్పే కథకు మెగాస్టార్ ఒకే చేస్తారా చూడాలి.